Sri Krishnadevaraya Jayanthi (17 January). A short story on Sri Krishnadevaraya the great emperor.

Jan 17.....
Sri Krishnadevaraya
He was the third ruler of the Tuluva Dynasty and is considered to be its greatest ruler....
Born on 17 January 1471 at Hampi...
ఈ రోజు శ్రీ కృష్ణ దేవరాయలుజయంతి....
శ్రీ కృష్ణ దేవరాయలు కాలాన్ని భారతదేశపు స్వర్ణయుగంగా పరిగణిస్తారు..అతని పాలనలో విజయనగర సామ్రాజ్యం ఉన్నతంగా వర్థిల్లింది. కళలు, సంస్కృతి మరియు  సాహిత్యంలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది.
అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఏడు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.
ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్య వధూప్రీణనము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే.
రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు.

Comments