Inspiration Story - ''''ఛత్రపతి శివాజీ"" - How Mother's Dream Fullfilled by Child


""ఛత్రపతి శివాజీ""


 తమ ఇంటి సమీపం లో ఉన్న శివాలయం లోని శివలింగాన్ని మొగలు సైనికులు అపవిత్రం చేయడాన్ని చూసి చలించిన ఆ బాలిక, తండ్రి దగ్గరకి పరుగున పోయి, "తండ్రీ, ఆ తుచ్చులు చేయరాని పని చేస్తున్నారు, వారిని దండించండి" అంటే ఆ తండ్రి, 
"తల్లీ, మనం మొగలు పాదుషా కొలువులో ఉన్నాము, వారినేమీ చేయలేము" అని దీనంగా బదులిచ్చాడు.
ఆ తరువాత బాలికకు పెళ్లి అయినాక, మరలా అదేవిధమైన దుశ్చర్యని చూసిన ఆమె భర్తని అడిగింది, వాళ్ళని శిక్షించమని కానీ ఆమెకి చిన్నప్పుడు తండ్రి చెప్పిన సమాధానమే ఎదురయ్యింది
అప్పుడు ఆ మహా సాధ్వి ప్రతిజ్ఞ చేసింది, "నా తండ్రి మరియు నా భర్త చేయలేనిదానిని నాకు పుట్టబోయే పుత్రుని ద్వారా చేయిస్తాను" అని..ఆ నాటి నుండి శివునిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆమె, తనకి పుట్టిన బిడ్డకి ఆ పరమ శివుని పేరే పెట్టుకుంది
చిన్ననాటి నుంచి ఆ బాలుని నర నరానా దేశభక్తి, ధైర్య సాహసాలు నూరి పోసింది. అతను తల్లికి ఇచ్చిన మాట ప్రకారం హిందూ సంస్కృతిని అవమానించిన తురుష్కులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు హిందూ సామ్రాజ్యాన్ని తల్లికి కానుకగా ఇచ్చాడు

ఆ తల్లి జిజాబాయి, ఆమె పుత్రుడు 
""ఛత్రపతి శివాజీ"".
అదిగో ఛత్రపతి.. ద్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి
మాతృభూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వ భౌముడు.

Comments